KRNL: కోసిగి(మం) జంపాపురంలోని బసవేశ్వర స్వామి దేవాలయం వార్షిక జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి తనయులు యువ నాయకులు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.