ATP: పెద్దవడగూరు మండలం భీమునిపల్లి, రావలుడికి గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఎస్సై ఆంజనేయులు సందర్శించారు. మహిళా కూలీలు, చిన్న పిల్లల భద్రతపై ఆయన అవగాహన కల్పించారు. మహిళలు రక్షణ కోసం ‘శక్తి యాప్’ డౌన్లోడ్ చేసుకోవాలని, ‘స్త్రీ రక్ష పోర్టల్’ ఉపయోగించుకోవాలని సూచించారు. అత్యవసర స్థితిలో 100, 112 నంబర్లను సంప్రదించాలన్నారు.