ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని ప్రజా సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.