KRNL: కర్నూలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీఓసీ ఛైర్మన్‌కి వినతిపత్రం సమర్పించినట్లు సంఘ నేతలు మునెప్ప, చంద్రశేఖర్ తెలిపారు. జీవో నం.17ను రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, 2019 నుంచి కార్మికులు పథకాల నుంచి వంచించబడ్డారని, బోర్డు వస్తే సంక్షేమ ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు.