PLD: అంగన్వాడీ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో 50 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5G ఫోన్లను అందజేశారు. ఎన్ఎంసీహెచ్ఎస్ (NMCHS) ఆధ్వర్యంలో సేవల నాణ్యతను పెంపొందించడానికి, డిజిటల్ సేవలు, పోషణ కార్యక్రమాల మానిటరింగ్‌కు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.