కృష్ణా: ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో పదిమందికి ఆహారాన్ని అందించే అన్న సమారాధనలు నిర్వహించడం మంచి కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలో త్రిశక్తి త్రిమూర్తి స్వరూప శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న సమారాధనను ప్రారంభించారు. పదిమంది ఆకలి తీర్చడం నిజంగా ఒక అదృష్టమని అన్నారు.