ప్రకాశం: ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో దర్శి టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి.. ఎస్పీ దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని కోరారు. దర్శిలో నమోదు చేసిన అక్రమ కేసులపై ఇప్పటికే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.