ATP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల వైసీపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఉరవకొండ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన దేశ ప్రగతికి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.