అన్నమయ్య: మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటేశులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుర్రంకొండ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సీతమ్మ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.