W.G: రైతులకు పూర్తి భద్రత కల్పిస్తూ రాజముద్ర, క్యూఆర్ కోడ్లతో కూడిన నూతన భూహక్కు పత్రాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. బుధవారం దిరుసుమర్రు గ్రామ సభలో 375 మంది రైతులకు ఆయన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పత్రాలు భూ యజమానులకు కొండంత అండగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సుజాత రామచంద్ర రాజు పాల్గొన్నారు.