KDP: భారతీయ సంస్కృతి గురువులకు విశిష్ట స్థానం కల్పించిందని, గురువులను గౌరవించడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి తెలిపారు. శుక్రవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు వైవి మునీశ్వర్ రెడ్డి, చప్పిడి శిరీష, బి గోపాల్ నాయక్, జి గోవర్ధన్‌ను సత్కరించారు.