NDL: ఈ నెల 21న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. మిగతా పరీక్షలు యథాతథంగా టైమ్‌టేబుల్ ప్రకారం కొనసాగుతాయని బండి ఆత్మకూరు ఎంఈవో యశోద గురువారం తెలిపారు. మార్చి 23న గణితం పరీక్ష యథావిధిగా జరుగుతుందన్నారు. ఈ మార్పును విద్యార్థులందరికీ తెలియజేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.