NDL: అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లబోతుల కొండయ్య అన్నారు. గురువారం మహానందిలో ఈశ్వర్ నగర్ కాలనీలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం బియ్యం బస్తాలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎండి ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జేఏసీ నాయకుడు రమేశ్ పాల్గొన్నారు.