PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సోమవారం తమ ఛాంబరులో ఇంజినీరింగ్ అదికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మండలాల వారిగా గృహ నిర్మాణాల పురోగతిని ఈ సందర్భంగా ఆరా తీశారు. ఉగాది నాటికి పూర్తి కావాల్సిన ఇళ్లు ఇంకా పెండింగ్లో ఉండటంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.