BPT: మార్టూరు మండలం లక్కవరం గ్రామంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని అభివృద్ధి పనులను, ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే, ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.