KRNL: రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జనవరి 1 నుంచి ఈనెల 6 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఓవర్ స్పీడ్ 1,763 కేసులు, హెల్మెట్ లేకుండా 1,590, సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు 2,928 నమోదు చేసినట్లు తెలిపారు.