అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తూ పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు శక్తి బృందాలు పాఠశాలలు, కళాశాలల వద్ద నిఘా పెంచాయి. విద్యార్థినులను వేధించే ఆకతాయిలను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భరోసా పెరిగిందన్నారు.