ELR: మండవల్లి, భైరవపట్నం గ్రామాలలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని టీడీపీ జెండా ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలు, ఆయన చేసిన సేవలు గుర్తు చేస్తూ పాలనా విధానాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.