PLD: మాచర్లలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కండ్లకుంటకు చెందిన కర్ల ఆంజనేయులు (28) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో ఏడాదిగా ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. మనోవేదన చెందిన అతడు ‘ఇదే నా చివరి మాట’ అంటూ స్నేహితులకు ఫోన్ చేసి రైట్ కెనాల్లో దూకాడు. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు.