GNTR: తెనాలి పరిధిలో అనధికారిక కట్టడాలను గుర్తించేందుకు ప్రభుత్వం 47 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన అధికారుల నుంచి సర్వే విధి విధానాలు బృందాలు తెలుసుకున్నాయి. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయికి వెళ్లనున్నాయి. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆర్డీ మధుకుమార్ పాల్గొన్నారు.