GNTR: పొన్నూరులోని నిడుబ్రోలు తుంగభద్ర డ్రెయిన్లో శుక్రవారం గుర్తు తెలియని యువకుడి శవం కొట్టుకు వచ్చింది. యువకుడి వయస్సు సుమారు 25సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోధుమ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సదరు వ్యక్తిని ఎవరైనా తెలిస్తే పొన్నూరు అర్బన్ ఎస్సై శ్రీహరిని సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.