ప్రకాశం: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీల పాత్ర కీలకం అని గుంటూరు ఆర్జెడి లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులకు ఒకరోజు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం శనివారం జరగగా ఆయన పాల్గొన్నారు. శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.