KRNL: బైకును ఢీ కొట్టగానే బస్సు డ్రైవర్ ఆగకుండా కొంత దూరం తీసుకెళ్లడంతో పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. లగ్జరీ, ఏసీ బస్సులో సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నీళ్లతో ఆర్పే ప్రయత్నం విఫలమైంది. అర్ధరాత్రి పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.