SKLM: ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈ నెల 19న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో 108 అక్కడికి చేరుకుంది. అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీనిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్ సంప్రదించాలన్నారు.