నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు స్థానిక 36/1 బ్రహ్మానందపురం సచివాలయం పరిధిలోని శాంతి అపార్ట్మెంట్స్, ఓబుల్ రెడ్డి నగర్లోని ద్వారకా రెసిడెన్సీ అపార్ట్మెంట్ ల నీటి పన్ను బకాయిలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నందున పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడంతో మున్సిపల్ తాగునీటి కుళాయిలను మంగళవారం తొలగించారు.