ELR: మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా ఏలూరు గిరిజన భవన్లో ఏపీ ఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ప్రతి మహిళ విద్యావంతురాలు అయితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.