CTR: సోమల మండలం సూరయ్యగారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఎంఈవో విజయ కుమారి గురువారం తనిఖీ చేశారు. మండలంలో ఉత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.