ప్రకాశం: సీఎస్ పురం మండలంలోని కదిరి బాబురావు వ్యవసాయ, ఉద్యాన కళాశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ముందుగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి కళాశాల డీన్ డాక్టర్ వీరన్న గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది అన్నారు.