KRNL: మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్.రాఘవేంద్రరెడ్డి మీకోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి భారీగా రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉండే సమస్యల గురించి వినతులు స్వీకరించారు. అనంతరం తక్షణమే వాటి పరిష్కారం కోసం అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.