SKLM: నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ 17వార్డు పూజారిపేట సాయన్న కోటర్స్లో ఇవాళ జరగుతున్న సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాల పనులను ఆయన పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.