BPT: వేటపాలెం మండలం రిలయన్స్ ఐ స్మార్ట్ సమీపంలోని ఓ టీ స్టాల్లో మైనర్ బాలురితో పనులు చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారులతో టీ తయారీ, సరఫరా పనులు చేయిస్తున్న దృశ్యాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతుడడం విచారకరమని స్థానికులు వాపోతున్నారు.