అన్నమయ్య: మదనపల్లి రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ మేరకు న్యాయవాది టి.ఈశ్వర్, డేరంగుల రమణయ్య, వాసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా, రాజ్యాంగం, చట్టాలపై అవగాహనతోనే వెనుకబడిన వర్గాలు హక్కులు పొందగలవని ఈశ్వర్ తెలిపారు. 50 లక్షల వడ్డెరలకు ఏపీ అసెంబ్లీలో ఒక్క ప్రతినిధి లేరని రమణయ్య అన్నారు.