సత్యసాయి: చెన్నేకొత్తపల్లి క్లస్టర్ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత శాఖాధికారులతో కలిసి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.