CTR: తవణంపల్లి మండలంలో ఇవాళ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఏ.గొల్లపల్లిలో మధ్యాహ్న భోజనం అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా డస్ట్‌బిన్స్ పంపిణీ, పాఠశాల అప్‌గ్రేడ్, అంగన్వాడీ భవనాలు, శ్మశానవాటిక, ప్రహరీ గోడలు వంటి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.