NLR: కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. గట్టమనేని సుశీలమ్మ, పేముల అబ్రహం-దయావతమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.