W.G: కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వీధి వీధిలో కుక్కలు దర్శనం ఇస్తున్నాయి. ఎన్నిసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను అదుపు చేయడంలో పంచాయతీ అధికారులు బాధ్యత తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.