W.G: నరసాపురంలోని 25వ వార్డు ఆదర్శనగర్కు చెందిన శ్రీశైలం హరి కనక సాయి(31) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున సాయి బైక్పై వెళ్తుండగా అంబేడ్కర్ విగ్రహం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వం ఆసుపత్రి తరలించారు.