TPT: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని వైద్య శాఖ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. మలేరియా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్లకు సమీప ప్రాంతాల్లో మురుగు నీరు నిలువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.