KDP: విధులు నిర్వహించేటప్పుడు భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉపయోగించాలని విద్యుత్ ఈఈ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కడప పట్టణంలోని విద్యుత్ కళావేదిక భవనంలో జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బంది LC తీసుకున్న తర్వాత ఒకట్రెండు సార్లు విద్యుత్ ఉందా, లేదా తెలుసుకున్న తర్వాతే విద్యుత్ స్తంభం ఎక్కాలని సూచించారు.