CTR: స్థానిక కలెక్టరేట్లో చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, జనగణన నిర్వహణపై ట్రైనర్లకు కీలక సూచనలు చేశారు. జనగణనను క్రమబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు.