సత్యసాయి: రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు విద్యుత్ చార్జీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అధికారంలో ఉన్నపుడు భారం వేసి నేడు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.