AP: ప్రజలకు మేనిఫెస్టో ప్రధానమని.. డాక్యుమెంట్లు కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మేనిఫెస్టో పక్కన పెట్టి విజన్ డాక్యుమెంట్ అంటున్నారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు చూసే ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలకు.. కేటాయింపులకు పొంతనేలేదని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా.. విజన్ పేరుతో బుక్లు రిలీజ్ చేస్తే ఏం లాభమని మండిపడ్డారు.