TG: సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చించనున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించినట్లు తెలుస్తుంది. శాటిలైట్ ఇమేజింగ్ ఏజెన్సీ సర్వీసులతో నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.