SKLM: ఇచ్చాపురం(మం) డొంకూరు సముద్రంలో లంగరు వేసిన బోటు అలల తాకిడికి మునిగి ధ్వంసమైంది. గ్రామానికి చెందిన బడే చిన్నారావుతో పాటు మరి కొంతమంది మత్స్యకారులు కలిసి సముద్రంలో వేట ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున తీరానికి చేరుకున్నారు. తీరానికి సమీప ప్రాంతం సముద్రంలో బోటును లంగరు వేసి ఇళ్లకు వచ్చేసారు. ఇంతలోనే రాకాసి అలలు తాకిడికి లంగరు వేసిన బోటు ధ్వంసమైంది.