సత్యసాయి: ధర్మవరం పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు ఏఎస్సై పుట్టప్ప ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.