TG: మాజీ CM KCRను ఎదుర్కోలేకే తనపై, KTRపై కేసులు పెడుతున్నారని MLC కవిత విమర్శించారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. 57 మంది గురుకుల బిడ్డలను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.