PPM: యువగళం పాదయాత్రలో విద్యార్థులకు నారా లోకేశ్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ.. సోమవారం విజయవాడలో జరిగే పోరు దీక్షకు విద్యార్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.