TG: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87 శాతం కేసులు పెరిగాయని DGP జితేందర్ అన్నారు. ఈ ఏడాదిలో 2,34,158 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకటి రెండు ఘటనలు మినహా.. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాదిలో 85 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. రూ.142.92 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని వెల్లడించారు.