AKP: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామ రోడ్డుకు ఫారెస్ట్ అనుమతులను తక్షణమే ఇవ్వాలని ఆదివారం గిరిజనులు గుర్రాలతో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఏపీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. గోవిందరావు మాట్లాడుతూ.. ఫారెస్ట్ అనుమతులు లేక నేటికీ రోడ్డు నిర్మాణం కావడం లేదన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించాలని కోరారు.