SKLM: సిరిపురం గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదం హృదయాలను కలచివేసిందని ఎంపీ కె. అప్పలనాయుడు అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఆదివారం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ మేరకు వారికి అండగా ఎంపీ, MLA కొండ్రు మురళి కలిపి రూ. 3 లక్షల సహాయంతోపాటు, నిత్యవసర వస్తువులు అందజేశారు. పక్క ఇళ్లు శాంక్షన్ చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.